తెలంగాణ

బాలాపూర్ రికార్డులు బ్రేక్.. రేసులో ముందున్న దిల్‌సుఖ్‌నగర్ లడ్డూ!

భాగ్యనగర చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే బాలాపూర్ గణేష్ లడ్డూ రికార్డును తాజాగా దిల్‌సుఖ్‌నగర్‌లో నిర్వహించిన లడ్డూ వేలం బద్దలుగొట్టి సరికొత్త రికార్డును నెలకొల్పింది. దిల్‌సుఖ్‌నగర్‌లోని ‘జై గణేశ్ యూత్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో సుమారు 2.5 కోట్లతో అద్భుతంగా డెకరేట్ చేసిన గణపయ్య సన్నిధిలో శనివారం లడ్డూ వేలం ఘనంగా నిర్వహించారు. పోటాపోటీగా సాగిన ఈ వేలంలో గణపతి లడ్డూ ప్రసాదం రూ.51 లక్షల ధర పలికింది. స్థానిక భక్తుడు రాజేష్ రూ.51 లక్షలు వెచ్చించి ప్రసాదాన్ని సొంతం చేసుకున్నాడు. మరోవైపు అదే మండపంలో స్వామి వారికి సమర్పించిన మరో లడ్డూను ఓ భక్తుడు రూ.25 లక్షలు వెచ్చించి వేలం పాటలో దక్కించుకున్నాడు. కాగా, ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ వేలం పాటలో రూ.39 లక్షల ధర పలికింది.