తెలంగాణ

Badradri : కారులో చిన్నారి మృతి

కారులో ఆడుకుంటున్న చిన్నారి డోర్స్ లాక్ కావడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది.ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం నింపింది. వివరాల్లోకివెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్ గ్రామ సర్పంచ్ నవీన్, ఐశ్వర్య దంపతులకు ఇద్దరు పిల్లలు తన్విత శ్రీ (4), సురక్ష ఉన్నారు.ఆదివారం స్కూలుకు సెలవు కావడంతో, ఇంటి వద్ద ఆడుకుంటూ ఉన్నారు. పేరెంట్స్ ఏదో పనిలో ఉండగా..పెద్ద కూతురు తన్విత శ్రీ లాక్ చేయని కారులో ఎక్కింది. ఆడుకుంటున్న క్రమంలోనే ఒక్కసారిగా కారు డోర్ లాక్ అయ్యింది. దీంతో ఊపిరాడక కాసేపటికే నాలుగేళ్ల చిన్నారి స్పృహ తప్పింది. చలనం లేకుండా పడి ఉన్న తన్విత శ్రీని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు.