తెలంగాణ
పవిత్ర పీఠానికి పట్టిన గ్రహణాలు.. గురుస్థానంలో ఉంటూ అరాచకానికి ఒడిగడుతున్న కీచకులు!!.
మెదక్ జిల్లా పాపన్నపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు నర్సింలుపై కొందరు విద్యార్థినులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తమతో వెకిలిగా ప్రవర్తించడంతో పాటు, డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నారని విద్యార్థినులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఆ ఉపాధ్యాయుడి ప్రవర్తనపై పలువురు విద్యార్థినులు ఇతర ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం అధికారుల విచారణ పరిధిలో ఉన్నట్లు సమాచారం.
