తెలంగాణ

Ayush Funds Misuse: ఆయుష్‌లో రూ.3.50 కోట్ల మందుల కొనుగోళ్లపై విచారణకు ప్రభుత్వం ఆదేశం

ఆయుష్ విభాగంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగినట్లు వచ్చిన ఫిర్యాదులపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తెలంగాణ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ చేసిన ఫిర్యాదు, ముఖ్యమంత్రి కార్యాలయం ఎండార్స్‌మెంట్ ఆధారంగా ఆరోగ్య, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ మెమో నెం.2653/E1/2025ను జారీ చేసింది. అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయుష్ డైరెక్టర్‌ను ప్రభుత్వం కోరింది.