అయోధ్య విరాళాల చోరీ కేసు.. ట్రస్ట్ సభ్యులకు ‘సిట్’ క్లీన్చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ కేసులో ఆలయ ట్రస్టు సభ్యులకు ఊరట లభించింది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రాలకు SIT క్లీన్చిట్ ఇచ్చింది. విరాళాల చోరీ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు వరకు ఈ విషయం వెళ్లింది. యూపీ ప్రభుత్వం ఈ కేసు విచారణ కోసం ‘సిట్’ను ఏర్పాటు చేయగా.. ఆలయంలో హుండీ డబ్బులు లెక్కించే సిబ్బంది చేతివాటం ఉన్నట్టు అధికారులు విచారణలో తేల్చారు. ఇందులో ఆలయ ట్రస్టు సభ్యుల ప్రమేయం ఎంతమేరకు ఉందని సిట్ మరింత లోతుగా దర్యాప్తు చేయగా.. తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ కేసులో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రాలకు SIT క్లీన్చిట్ ఇచ్చింది. విరాళాల చోరీ ఘటనలో వీరిద్దరి ప్రమేయం ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదని ‘సిట్’ తన దర్యాప్తు నివేదికలో పేర్కొంది.
