తెలంగాణ

ఆటో కార్మికులు తొందరపడొద్దు.. సమస్యలు పరిష్కారిస్తాం : మంత్రి పొన్నం

నేటి అర్ధరాత్రి నుంచి ఆటో డ్రైవర్లు బంద్‌ పిలుపుపై తాజాగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీంతో ఆటో, క్యాబ్, పాఠశాల వ్యాన్ డ్రైవర్లు తలపెట్టిన నిరవధిక బంద్ వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఆటో కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సమ్మెల వల్ల సమస్యలు పరిష్కారం కావని, చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ఆదివారం హుస్నాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2015 తర్వాత రాష్ట్రంలో ఆటో చార్జీలు పెరగలేదని మంత్రి గుర్తుచేశారు. పెరిగిన నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ఆటోఛార్జీల పెంపుపై అధ్యయనం చేయడానికి త్వరలో ప్రత్యేక కమిటీని వేస్తామన్నారు.ఇందులో ఆటో కార్మికుల ప్రతినిధులతో పాటు రవాణా శాఖ అధికారులను భాగస్వామ్యం చేస్తామన్నారు.