క్రీడలు

అంతర్జాతీయ క్రికెట్‌కు ఆస్ట్రేలియా దిగ్గజం గుడ్ బై..

ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో మరో శఖం ముగిసింది. ఆసీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్ ‘గ్లెన్ మ్యాక్స్‌వెల్’ అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు గుడ్ బై చెప్పారు. 14 ఏళ్ల పాటు కొనసాగిన సుదీర్ఘ ఇంటర్నేషనల్ క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వన్డేలు, టెస్టుల నుంచి ఇప్పటికే వైదొలిగిన మ్యాక్స్ వెల్ తాజాగా అంతర్జాతీయ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే, బిగ్ బాష్ లీగ్ (BBL), టీ20 లీగ్‌లలో ఫ్రాంచైజీల తరఫున ఆటగాడిగా కొనసాగుతానని చెప్పారు. 2012లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన మ్యాక్స్‌వెల్ జట్టు కోసం ఎన్నో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆస్ట్రేలియా టీం సాధించిన చారిత్రక విజయాల్లో కీలక పాత్ర పోషించారు. 2015, 2023 వన్డే ప్రపంచకప్‌లతో పాటు 2021లో టీ20 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా నెగ్గడానికి తన వంతు పాత్ర పోషించారు.