International

ఊహించని పని చేసిన ఏఐ.. నియమాలను ఉల్లంఘించి!..

ఒక్క జిమ్ క్లాస్ బుక్ చేసుకోవడానికి ఏఐని ఉపయోగిస్తే.. అది ఏకంగా మరో వ్యక్తి రిజర్వేషన్‌నే క్యాన్సిల్ చేసింది! మెల్‌బోర్న్‌కు చెందిన ఆండ్రూ తన పర్సనల్ ఏఐ అసిస్టెంట్‌తో జిమ్ క్లాస్ బుక్ చేయించాడు. అయితే ఏఐ జిమ్ APIలోని భద్రతా లోపాన్ని గుర్తించి, ముందుగానే బుకింగ్ చేయడంతో పాటు.. వెయిటింగ్ లిస్ట్‌లో తనకంటే ముందున్న వ్యక్తి రిజర్వేషన్‌ను రద్దు చేసింది. దీంతో ఆండ్రూ నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి చేరాడు. అసలు ఆ వ్యక్తిని తొలగించమని ఆండ్రూ చెప్పకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఏఐ తప్పు చేస్తే బాధ్యత ఎవరిది? అనే ప్రశ్న ఇప్పుడు తెరపైకి వచ్చింది.