తెలంగాణ
August 15 Celebrations: పంద్రాగస్టు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి-వికాస్ రాజ్
August 15 Celebrations: పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లపై శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు రవాణ, ఆర్అండ్బీ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్. స్వాతంత్ర్య వేడుకల ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారాయన. శనివారం గోల్కొండ కోటలో నిర్వహించనున్న స్వాతంత్ర్య వేడుకలు జరిగే ప్రాంతాన్ని గురువారం సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.
