కూకట్పల్లి ట్రక్ పార్కుల భూముల వేలం.. బిడ్డా మీ సంగతి చూస్తా! : హరీశ్ రావు
కూకట్పల్లి ట్రక్ పార్కుల భూములు వేలం వేయాలన్న తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్,మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు రేవంత్ రెడ్డి భూముల చుట్టే తిరుగుతున్నాడని, సీఎం కుర్చీలో కూర్చుని రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడని ఆరోపించారు. నాడు బొందల గడ్డకు జాగా ఉండదని డైలాగులు కొట్టిన ముఖ్యమంత్రి.. నేడు కైతలాపూర్‌లో బొందల గడ్డను కూడా చదును చేస్తున్నారని మండిపడ్డారు.కూకట్పల్లి మూసాపేట ట్రక్ పార్క్ భూముల్లో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, ఆర్టీఓ ఆఫీస్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, నర్సరీని కూడా అమ్మకానికి పెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. ‘బిడ్డా జాగ్రత్త.. రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. వేలంలో ఎవరు భూములు కొన్నా అనుమతులు ఇవ్వం. మళ్లీ వెనక్కి తీసుకుని ప్రజా అవసరాలకే వాడుతాం’ అని హరీశ్ రావు హెచ్చరించారు.
