తెలంగాణ
విలీన చరిత్రకు మతం రంగు పులిమే ప్రయత్నాలు.. కవిత విమర్శలు!
సెప్టెంబర్ 17 తెలంగాణ పౌరుషానికి, త్యాగాల చరిత్రకు నిదర్శనమని, అయితే ఈ చారిత్రక ఘట్టాన్ని కాంగ్రెస్, బీజేపీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పూర్తిగా వక్రీకరిస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత విమర్శించారు. సెప్టెంబర్ 17 పురస్కరించుకుని బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ విలీన పోరాట యోధుల స్ఫూర్తితో రాష్ట్రంలో రాజ్యమేలుతున్న అరాచక శక్తులను గద్దె దించాలని పిలుపునిచ్చారు.
