International

హోర్ముజ్‌లో దాడులు.. ఇద్దరు భారతీయులు గల్లంతు

హోర్ముజ్ జలసంధిలో మరోసారి యుద్థవాతావరణం కనిపిస్తోంది. అందులో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై డ్రోన్ దాడి జరిగింది. ఎంటీ పెట్రో డాల్ఫిన్ అనే నౌకపై డ్రోన్‌ దాడి జరగగా ట్యాంకర్‌లో అగ్రిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన టైంలో నౌకలో 11 మంది భారతీయులు ఉన్నారు. వారిలో 9మందిని సురక్షితంగా కాపాడగా, ఇద్దరు గల్లంతైనట్టు సమాచారం. వెంటనే అప్రమత్తమైన స్థానిక కోస్టు గార్డ్ దళం గల్లంతైన ఇద్దరు నావికుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది.ఈ ఘటనపై ఓడరేవులు, నౌకాయాన జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనావాల ‘ఎక్స్’ వేదికగా రియాక్ట్ అయ్యారు. పెట్రో డాల్ఫిన్ అనే ట్యాంకర్‌పై సోహార్ యాంకరేజ్ వద్ద డ్రోన్ దాడి జరిగిందని తెలిపారు. నౌకలో 11మంది భారతీయ సిబ్బంది ఉంటే వారిలో ఇద్దరు గల్లంతయ్యారన్నారు.