National

అమెరికా పోలీసులపై టపాసులతో దాడి.. దేశం పరువు తీస్తున్నారంటూ?

ఉద్యోగం, ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన భారతీయుల ఆగడాలు శృతి మించుతున్నాయా? అందుకే ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ భారతీయులను టార్గెట్ చేశాడా? చదువు, ఉద్యోగం కోసం వచ్చి అక్కడే సెటిల్ అయ్యి అమెరికన్స్‌ను డామినేట్ చేస్తున్నారనే భారతీయుల మీద ద్వేషం పెరిగి లోకల్స్ దాడులకు తెగబడుతున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దీపావళి రోజున అమెరికాలోని న్యూయార్క్‌లో భారతీయులు రోడ్డుపై టపాసులు కాల్చడం కలకలం రేపింది.దీంతో వాహన దారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో పరిస్థితిని అదుపు చేయడం కోసం పోలీసులు అక్కడికి వెళ్లగా వారిపైనే టపాసులు విసిరి హ్యాపీ దీపావళి అంటూ సందడి చేశారు. అక్కడే ఉన్న ఇతర భారతీయులు వాళ్లను అడ్డుకోకుండా నవ్వుతూ చోద్యం చూస్తూ ఉండిపోయారు.దీంతో ఇండియన్స్ బిహేవియర్ మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.