క్రైమ్

క్యాబ్ ఎక్కుతుండగా అమానుషం.. మహిళా టెకీని లాగి ముద్దుపెట్టిన సెక్యూరిటీ

ఉద్యోగాలు చేస్తున్న మహిళలు, యువతులకు వేధింపులు ఆగడం లేదు. ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్న ఏదో ఒక రూపంలో వారికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. కొందరు కామాంధులు కావాలనే ప్లాన్ ప్రకారం వారి మీద దాడులు చేయడం, లైంగికంగా వేధించడం వంటివి చేస్తున్నట్టు తెలుస్తోంది. బస్సులో, ఆఫీసులో, జనసముదాయంలోనూ ఏదో రకంగా అతివలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. బాడీషేమింగ్ చేయడం,అక్కడ ఇక్కడ టచ్ చేయడం వంటివి చేస్తున్నట్టు ఫిర్యాదులొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ మహిళా ఉద్యోగినికి చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్‌లో ఉద్యోగానికి వెళ్లేందుకు క్యాబ్ ఎక్కుతున్న మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను ఓ సెక్యూరిటీ గార్డు పక్కకు లాగి ముద్దు పెట్టినట్టు సమాచారం. వైజాగ్‌కు చెందిన 24 ఏళ్ల యువతి గచ్చిబౌలి ఇందిరానగర్‌లోని పీజీ హాస్టల్‌లో ఉంటూ ఐటీ కారిడార్‌లో పనిచేస్తున్నది.ఇవాళ ఉదయం విధులకు వెళ్లేందుకు క్యాబ్ ఎక్కుతున్న యువతిని ఓ వ్యక్తి అకస్మాత్తుగా పక్కకు లాగి ముద్దు పెట్టాడు.