National
సీఎంను ప్రశ్నించిందని.. మహిళా జర్నలిస్టుపై ఘోరం
దేశరాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది.ఓ మహిళా జర్నలిస్టుపై ఢిల్లీ పోలీసులు తమ ప్రతాపం చూపించారు. బాధితురాలు తన విధినిర్వహణలో భాగంగా ఢిల్లీ సీఎం రేఖాగుప్తాను ప్రశ్నించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే, ప్రశ్నించిన జర్నలిస్టు మీద పోలీసులు దాడి చేసిన ఘటన దేశరాజధానిలో హాట్ టాపిక్ అయ్యింది. పోలీసులు దాడి చేయడంతో మహిళా జర్నలిస్టు కింద పడిపోయినట్టు తెలిసింది.దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకివెళితే.. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాను ‘4PM’ న్యూస్‌కి చెందిన షాహీన్ ఖాన్ అనే జర్నలిస్ట్ ప్రశ్నించడానికి ప్రయత్నించినట్టు సమాచారం. దాంతో ‘సీఎంనే ప్రశ్నించే స్థాయా నీది?’ అంటూ ఢిల్లీ పోలీసులు సదరు మహిళా జర్నలిస్ట్‌పై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.
