తెలంగాణ
రేవంత్ పాలనలో ఎస్సీలపై ఘోరాలు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని.. వారి ధన, మాన, ప్రాణాలకు ఈ ప్రభుత్వం రక్షణ కల్పించడంలో విఫలం అయ్యిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కులాంతర వివాహాం చేసుకున్న ఓ యువకుడి ఇంటిని కొందరు దుండగులు కూల్చివేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆయన ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘రేవంత్ పాలనలో ఎస్సీలపై మరో ఘోరం. గద్వాల జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీ యువకుడి ఇంటిని సర్పంచ్ ప్రేరేపణతో కొందరు దుండగులు కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.ఇది అమానవీయ సంఘటన. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే నేరం. అందరు బాధ్యులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి’ అని డిమాండ్ చేశారు.
