ఏసీబీ వలలో అసిస్టెంట్ ఇంజినీర్.. రూ.1,20వేల లంచం డిమాండ్
హైదరాబాద్‌లో కరెంట్ మీటర్ల మంజూరు కోసం రూ. 1,20,000 లంచం తీసుకుంటూ టీజీఎస్పీడీసీఎల్ (TGSPDCL) అసిస్టెంట్ ఇంజనీర్ పీఎస్ రాకేష్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆయన మదన్నపేట సెక్షన్ సంతోష్ నగర్ సబ్‌స్టేషన్ పరిధిలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఫిర్యాదు దారుడి భవనానికి కొత్తగా 6 విద్యుత్ మీటర్లను మంజూరు చేయడానికి భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధిత వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందస్తు ప్లాన్ ప్రకారం బాధిత వ్యక్తి అసిస్టెంట్ ఇంజినీర్ రాకేశ్‌కు రూ. రూ.1,20,000 లంచం రూపేణా అందజేస్తున్న క్రమంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రసాయన పరీక్షలు నిర్వహించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారులు లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని, ఏఈ రాకేష్‌పై కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ కోర్టుకు తరలించారు.
