తెలంగాణ

అసెంబ్లీలో బీజేపీ తాడో పేడో

నేటి నుంచి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయసభలు ప్రారంభం కానుండగా.. సెషన్స్ ప్రారంభమైన కాసేపటికే సీఎం రేవంత్ రెడ్డి పలు బిల్లులను శాసనసభ ముందు ఉంచనున్నారు. అనంతరం ప్రశ్నోర్థరాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధం అవుతున్నాయి. అసెంబ్లీ ప్రారంభానికి ముందే ఉదయం 8:30 గంటలకు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్ పార్క్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత, రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని నిన్న నిర్వహించిన భేటీలో బీజేపీఎల్పీ నిర్ణయానికి వచ్చింది. ఫీజ్ రీయింబర్స్‌మెంట్, ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, 22A, రైతు సమస్యలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీల పై సమాధానం చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయనున్నట్టు తెలుస్తోంది.