National

Assam Bus Accident: ఘోరం.. ట్రక్కు ఢీకొని 23 మంది మృతి.. నుజ్జయిన బస్సు!

Assam Bus Accident: అస్సాంలో పెను విషాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత కాజీరంగా నేషనల్‌ పార్క్‌ సమీపంలో ఓ మినీ బస్సు, భారీ కంటైనర్‌ ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 23 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పలువురు విద్యార్థులు కూడా ఉండటంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.బోకాఖాత్‌ నుంచి నాగావ్‌ వైపు వెళ్తున్న మినీ బస్సు, కాజీరంగా పార్క్‌ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు మినీ బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న చాలామంది లోపలే చిక్కుకుపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. రూల్స్ బ్రేక్ చేసి నేషనల్ పార్క్‌ సమీపంలో బస్సును అతి వేగంతో నడపడమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అతివేగం వల్లే డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయి ట్రక్కును ఢీకొట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు.