క్రీడలు

Asian Games 2026: ఆర్చరీలో భారత్‌ జోరు.. రికర్వ్‌లో తొలి స్వర్ణం!..

ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్లు అదరగొట్టారు. మహిళల రికర్వ్‌ టీమ్‌ ఈవెంట్‌లో అంకితా భకత్‌, కీర్తి శర్మ, కుంకుమ్‌ మొహద్‌ త్రయం స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్‌లో పది సార్లు ఛాంపియన్‌గా నిలిచిన దక్షిణకొరియాను 5-3తో ఓడించి సంచలన విజయం నమోదు చేసింది. అంతకుముందు సెమీస్‌లో చైనాను 5-1తో చిత్తు చేసింది. హాంగ్జౌలో కాంస్యంతో సరిపెట్టుకున్న భారత్‌.. ఈసారి రికర్వ్‌లో ఏకంగా గోల్డ్‌ సాధించింది. తాజా స్వర్ణంతో భారత్‌ పతకాల పట్టికలో ఏడో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం 11 స్వర్ణాలు, 23 రజతాలు, 33 కాంస్యాలతో మొత్తం 67 పతకాలు భారత్‌ ఖాతాలో ఉన్నాయి.