International
Asia war: మిడిల్ ఈస్ట్‌లో హై టెన్షన్.. అప్రమత్తమైన ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్!!..
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఇరాన్, దాని ప్రాక్సీ దళాలు, అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో ఈ ప్రాంతంలో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే సైనిక ముప్పును ముందస్తుగా ఊహిస్తూ ఇరాన్ తన సాయుధ బలగాలను అప్రమత్తం చేసింది. పరిస్థితుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన క్యాంప్ డేవిడ్ పర్యటనను వెంటనే రద్దు చేసుకుని, అత్యవసరంగా వైట్ హౌస్‌కు చేరుకున్నారు. అలాగే, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు కూడా తన అమెరికా పర్యటనను మధ్యలోనే ముగించుకుని అత్యవసరంగా స్వదేశానికి తిరుగుపయనమయ్యారు.
