సినిమా
Ashu Reddy: సుధీర్ తో పెళ్లి.. మొత్తానికి బయట పెట్టిన అషురెడ్డి
Ashu Reddy: బుల్లితెర స్టార్ కమెడియన్, యాంకర్ సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. గతంలో యాంకర్ రష్మితో ఆన్‌స్క్రీన్ లవ్ ట్రాక్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సుధీర్, ఆ తర్వాత ఛానల్ మారి బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డితో కలిసి చేసిన సందడి హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా 'ఫ్యామిలీ స్టార్స్' షోలో అషురెడ్డి ఆప్యాయంగా సుధీర్‌ను 'బావ' అని పిలిచినప్పటి నుంచి, వీరిద్దరి మధ్య నిజంగానే ప్రేమాయణం నడుస్తోందంటూ ప్రచారం మొదలైంది. ఏకంగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ రూమర్స్‌పై అషురెడ్డి స్పందిస్తూ అసలు నిజాన్ని బయటపెట్టింది.
