National

Arvind Kejriwal: E20 పెట్రోల్ పై ఇక సమరమే.. ప్రధాని ఇంటికి.. కేజ్రీవాల్ కీలక ప్రకటన

కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన E20 పెట్రోల్ పాలనీ క్రమ క్రమంగా రాజకీయ వేడి పెంచుతోంది. E20 ఇంధన విధానంపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పోరుబాట పట్టారు. పెట్రోల్ బంకుల్లో వాహనదారులకు సాధారణ పెట్రోల్ లేద 20 శాతం ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్ ఎంచుకునే వెసులుబాటు కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆగస్టు 4న ప్రధాని నివాసానికి పాదయాత్ర చేపట్టనున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు.