National
Arunachal Pradesh: భారీ వర్షాలతో అరుణాచల్ అతలాకుతలం.. గల్లంతైన ఆర్మీ సిబ్బంది!..
అరుణాచల్‌ప్రదేశ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో పాటు ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ ప్రకృతి విపత్తు ఇప్పటికే నలుగురి ప్రాణాలను బలితీసుకోగా.. మరోవైపు ఐదుగురు ఆర్మీ సిబ్బంది గల్లంతవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఎగువ సుబన్సిరి జిల్లాలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కొండచరియల కింద ఎవరైనా చిక్కుకుపోయారా అనే అనుమానంతో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. అయితే భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు..
