International
Arnaud Denis: బాధ భరించలేక కారుణ్య మరణం పొందిన 43 ఏళ్ల నటుడు!..
ఫ్రెంచ్ నటుడు, దర్శకుడు ఆర్నాడ్ డెనిస్ 43 ఏళ్ల వయసులో కారుణ్య మరణం ద్వారా ప్రాణాలు విడిచారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో కొన్నేళ్లుగా పోరాడిన ఆయన.. బెల్జియంలో కారుణ్య మరణం పొందినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. హెర్నియా సర్జరీ తర్వాత వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా డెనిస్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక భరించలేక, వైద్యులను సంప్రదించించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు నటుడి లాయర్ తెలిపారు.
