తెలంగాణ
రేపు తీరం దాటనున్న ‘అర్నాబ్’.. తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు
అర్నాబ్ తుపాన్ కారణంగా రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ప్రమాదకరమైన 'అర్నాబ్' తుపాను అక్టోబర్ 28 ఉదయానికి ఏపీలో తీరం దాటే అవకాశం ఉన్నది. అయితే, తీరం దాటే సమయంలో తూర్పు తెలంగాణలో (ఎరుపు రంగులో గుర్తించిన ప్రాంతాలు) భారీ నుండి అతి భారీ వర్షాలు (100-120 మి.మీ వరకు) కురిసే అవకాశం ఉంది. అలాగే, గంటకు 50-60 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.ఇక నీలం రంగులో గుర్తించిన జిల్లాల్లో అక్టోబర్ 27 రాత్రి, అక్టోబర్ 28న తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో అక్టోబర్ 28న మోస్తరు వర్షాలు (30 మి.మీ వరకు) కురిసే అవకాశం ఉన్నట్టు సమాచారం. గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.
