తెలంగాణ
TG: ఖమ్మం, భద్రాద్రికి అర్నబ్ తుఫాన్ ముప్పు.. రంగంలోకి మంత్రి పొంగులేటి!
TG: బంగాళాఖాతంలో కల్లోలం రేపుతున్న ‘అర్నబ్’ తుపాను ప్రభావం ఇప్పుడు తెలంగాణ వైపు మళ్లుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని సరిహద్దు ప్రాంతాలకు పెను ముప్పు పొంచి ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ తుఫాను ప్రభావంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కుండపోత వర్షాలతో పాటు భీకరమైన ఈదురుగాలులు విరుచుకుపడే ప్రమాదం ఉండటంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రమాద తీవ్రతను ముందుగానే పసిగట్టిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయి అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు.వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో బుధవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్లతో మంత్రి పొంగులేటి నేరుగా ఫోన్లో మాట్లాడి గ్రౌండ్ లెవల్ పరిస్థితులపై సమీక్షించారు.
