ఏపీ
AP: తీరం వైపు 'అర్నబ్'.. ఉత్తరాంధ్రకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు!
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుపాను తీరం వైపు శరవేగంగా దూసుకొస్తోంది. ప్రస్తుతానికి ఈ తీవ్ర తుపాను కాస్త బలహీనపడి సాధారణ తుపానుగా మారినప్పటికీ, ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రం పెను ముప్పు పొంచే ఉంది. ఈ రోజు రాత్రికి ఇది మరింతగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్నా.. దీని ప్రభావంతో ఒక్కసారిగా విరుచుకుపడే ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్) స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.‘అర్నబ్’ ప్రభావంతో గురువారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వానలు పడనుండగా.. ఒకటి రెండు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు ముంచెత్తే సూచనలు కనిపిస్తున్నాయి.
