తెలంగాణ

Army : మద్రాస్ రెజిమెంట్‌లో నాలుగు ఏకే 47 తుపాకులు చోరీ

సికింద్రాబాద్‌ మద్రాసు ఆర్మీ రెజిమెంట్‌లో భారీగా ఆయుధాలు చోరీ అయినట్టు తెలుస్తోంది. ఆర్మీ పరిసరాల్లోకి సామాన్య మానవుడు ఎవరూ ప్రవేశించలేరు. అందులో పనిచేసేవారికి అధికారులు, ఐడీ కార్డు కలిగిన వారికి మాత్రమే లోనికి ప్రవేశం ఉంటుంది.సీసీ కెమెరాలతో పాటు భద్రతా సర్వేలెన్స్ కూడా నిత్యం గమనిస్తుంటుంది.అంతటి కట్టుదిట్టమైన భద్రతా నడుమ ఆయుధాలు ఎలా మిస్ అయ్యాయి అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మిలిగింది. రెజిమెంట్‌లోకి చొరబడ్డ దొంగలు 12 అత్యాధునికమైన ఆయుధాలను ఎత్తుకెళ్లినట్టు సమాచారం.దీనిపై అధికారులు బొల్లారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. గది తాళాన్ని పగలగొట్టి 12 ఆయుధాలు ఎత్తుకెళ్లగా.. అందులో నాలుగు ఏకే 47, ఆరు పిస్టల్స్ ఉన్నట్టు సమాచారం.అంతేకాకుండా ఒక ఇన్సాస్ రైఫిల్‌తో పాటు పెద్ద మొత్తంలో మందుగుండును కూడా ఎత్తుకెళ్లినట్టు అధికారులు గుర్తించారు.