తెలంగాణ

కాంగ్రెస్ సోషల్ మీడియా స్టేట్ సెక్రెటరీగా అరెల్లి కిరణ్ గౌడ్

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సోషల్ మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కీలక అడుగులు వేస్తున్నది. రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ బలంగా పనిచేస్తున్న తరుణంలో అధికార పార్టీ తరపున గట్టి కౌంటర్ ఇవ్వడానికి సోషల్ మీడియా విభాగ అధిపతుల్లో మార్పులు చేర్పులు చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే అరెల్లి కిరణ్ గౌడ్‌ కాంగ్రెస్ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా డిపార్ట్‌మెంట్ నూతనంగా ఎన్నికైన సోషల్ మీడియా సెక్రెటరీల లిస్ట్‌ను విడుదల చేసింది.అరెల్లి కిరణ్ గౌడ్.. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని సూరయ్యపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కీలక నేత.