తెలంగాణ

నా కంపెనీని టెండర్ వేయొద్దని చెప్తారా? : రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం

రాష్ట్రంలో కమీషన్ల అంశం రాజకీయ హీట్‌ను రగిలించింది. సొంత పార్టీ నుంచే ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్నాయి.రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. రేడియల్ రింగు రోడ్డు ప్రాజెక్టులో కమీషన్ల కోసమే తన కంపెనీకి టెండర్ దక్కకుండా చేసి ఆంధ్రావాళ్లకు కట్టబెట్టారని ఆరోపించారు. తెలంగాణ కంపెనీలకు పనులు దక్కకుండా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ లాబీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను నిర్ణయిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.తన కంపెనీ నుంచి టెండర్ వేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు రుద్ర ఉదయ్ సింహా కాల్ చేసి చెప్పారని పేర్కొన్నారు.2015 ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డితో పాటు రుద్ర ఉదయ్ సింహ కూడా నిందితుడిగా ఉన్నాడని తెలిపారు.అయితే, తన కొడుకు కంపెనీ సుశీ ఇన్‌ఫ్రా.. అతను బిడ్డింగ్‌లో పాల్గొంటాడని రుద్ర ఉదయ్ సింహకు చెప్పానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుర్తుచేశారు.రేడియల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలతో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం ఉందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు.