స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

లంచావతారులకు మళ్లీ కీలక పోస్టింగులా?

ప్రజలకు రక్షణ కల్పించి, శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీస్ శాఖలోనే కొందరు అధికారులు అవినీతి నిరోధక శాఖ (ACB) వలలో చిక్కినా ప్రభుత్వం ఇంకా వారిలో పట్టం కడుతూ పదోన్నతులు కల్పిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడి.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదవడం వంటి ఘటనలు పోలీస్ శాఖ ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి. గత మూడేళ్లుగా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో పోలీస్ అధికారులపై పెద్ద ఎత్తున ఏసీబీ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసుల అనంతరం సంబంధిత అధికారులపై తీసుకున్న శాఖాపరమైన చర్యలేమిటి? వారు ప్రస్తుతం ఏ స్థానాల్లో పనిచేస్తున్నారు? తిరిగి కీలకమైన ఫోకల్ పోస్టుల్లోనే బాధ్యతలు అప్పగించారా? అనే ప్రశ్నలు ఇప్పుడు అధికార, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి