స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

ఖానామెట్ కబ్జారాయుళ్లు వీళ్లేనా?

చరిత్ర అందరికి తెలిసిందే.. ఇప్పుడు జరుగుతున్న కబ్జాలపై అప్రమత్తత అవసరం. ఖానామెట్‌లో 41 సర్వే నంబర్ ఏ.252.24 గుంటల వివాదాస్పద సమాచారం గూగుల్‌లో వెతికినా దొరుకుతుంది. అలాంటి లిటిగేషన్ భూముల్లో ఫేక్ పేపర్స్ సృష్టించి, నాయకుల అండదండలతో కబ్జాలకు పాల్పడుతున్నారు. దశాబ్దాల క్రితం రిజిస్ట్రేషన్ చేసి కొనుగోలు చేసుకున్న వారికి మీ పొజిషన్ ఇక్కడ కాదు, అక్కడ అంటూ వేరే చోటకు వెళ్లి అక్కడ చుట్టూ బౌండరీలు కట్టేసుకుంటూ, నాలుగు ఐదు ముఠాలు తిరుగుతున్నాయి.ఏడాదిగా సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ పేర్లు చెప్పుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మూడు నెలల క్రితం మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు అయితే, ఖైరతాబాద్ బీజీపీ నేత పల్లపు గోవర్ధన్‌తో పాటు గోపాలకృష్ణ వర్మరాజు, మక్బూల్ హమ్మద్, రవి నాయక్‌లపై కేసులు నమోదు అయ్యాయి.