ఫండ్స్ గోవిందా? తెలంగాణ లోకల్ ఎలక్షన్స్ ఇంకెప్పుడో?
తెలంగాణలో ఎంపీటీపీ, జెడ్పీటీసీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు కూడా పెండింగులోనే ఉన్నాయి. ఈ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా? అని అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. జీహెచ్ఎంసీ పాలన గడువు ఈ ఏడాది ప్రారంభంలో ముగియడంతో ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్లు పాలన కొనసాగిస్తున్నారు.చాలా కాలంగా పెండింగ్లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రేవంత్ సర్కార్ కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న MPTC, ZPTC స్థానాలతో పాటు GHMC, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.డిసెంబర్ చివర్లో లేదా 2027 జనవరి తొలి వారంలోగా ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయించినట్టు టాక్ వినిపిస్తోంది. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుందని తెలుస్తోంది.
