సీఎంలే తెలంగాణ భూ దోపిడీదారులు?
ఓఆర్ఆర్ లోపల ఎక్కడ ఖాళీగా భూములు ఉన్నా అవి ప్రభుత్వ భూములేనా? క్లియర్ టైటిల్ అయితే రింగ్ రోడ్డు అవతల కూడా రూ.50 వేలకు గజం జాగా అమ్ముకుంటూ, చుట్టూ అపార్ట్మెంట్స్, విల్లాలు నిర్మిస్తుంటే ఇక్కడ మాత్రం దశాబ్దాల కాలంగా ఎందుకు నిర్మాణాలు జరగడం లేదు. ప్రైవేట్ భూములు అయితే ఒకే చోట వందల ఎకరాలు ఉండవు.
కోర్ ఏరియా అయినా అర్బన్ సీలింగ్ ఏరియా అయినా 1000 గజాల కంటే ఎక్కువ ఉండదు. కానీ, చట్టాలు అమల్లో ఉన్నా 30 ఏండ్ల తర్వాత వాళ్లకు అనుకూలంగా పేపర్స్ సృష్టించుకుని వేల కోట్ల భూములను కొట్టేస్తున్నారు. ఆనాటి సర్వే నెంబర్ భూములు, ఇప్పటికీ మినిస్టర్ క్వార్టర్స్ అని చెప్పుకుని క్లైం చేసుకున్న మంత్రి వివేక్ ఫ్యామిలీ, 403 మొత్తం ప్రభుత్వ భూమి పట్టా భూమి అయితే అర్బన్ సీలింగ్ యాక్ట్‌లో ఎందుకు డిక్లేర్ చేయలేదు. మున్సిపల్ నెంబర్స్ ఇచ్చినా ఇంకా మిగులు భూమి ప్రభుత్వ భూమియే అని అమ్ముకుంటూ వేల కోట్లు సంపాదించారు.
