International
మంచు కరగడానికి పెంగ్విన్ పక్షులే కారణమా!? అంటార్కిటికాలో ఏం జరుగుతోంది?
శాశ్వత మంచు ఖండమైన అంటార్కిటికాలో ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా మంచు వేగంగా కరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మంచు కరిగే ప్రక్రియను మరింత వేగవంతం కావడం వెనుక ఒక అనూహ్యమైన కారణం ఉందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. అంటార్కిటికాలోని పెంగ్విన్ పక్షుల విసర్జితాలు (రెట్టలు) అక్కడి మంచు కరగడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అమెరికాలోని కొలరాడో విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు. సముద్ర జీవుల ఆహార శృంఖలానికి, అంటార్కిటికాలోని వాతావరణ మార్పులకు మధ్య అత్యంత ఆసక్తికరమైన అనుబంధం ఉందని ఈ అధ్యయనం ద్వారా వెల్లడైంది.
