వైరల్ న్యూస్

ఆ శాఖల్లోనే ఎక్కువ లంచం డిమాండ్? భారతీయ విద్యార్థి సంచలన ఆవిష్కరణ

ఇండియాలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు శాఖలు, కార్యాలయాల్లో లంచం లేనిదే పనికాదు అనేది ఎవరిని అడిగినా చెబుతున్నారు. ప్రభుత్వశాఖల్లో అయితే మరి ఘోరం.. వృద్ధులకు పెన్షన్ ధ్రువపత్రాలు ఇవ్వడానికి కూడా లంచాలు డిమాండ్ చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. శాఖ ఏదైనా డబ్బులు ముట్టజెప్పనిదే ఫైల్ కదలదు అనేది జగమెరిగిన సత్యం. అయితే, పనివిషయంలో అధికారులు లంచం డిమాండ్ చేశారా? ఎవరైనా చెల్లించారా? లేదా నిరాకరించారా? ఏ శాఖలో ఎక్కువగా లంచం డిమాండ్ చేస్తున్నారు? వంటి వివరాలతో భారతీయ విద్యార్థి ఏఐ కోడింగ్ సాయంతో ప్రత్యేకంగా ఓ వైబ్‌సైట్ బిల్డ్ చేశాడు. లంచాల నిరోధం, ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకతను పెంచేందుకే ‘మహారాజా అగ్రసేన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ విద్యార్థి ఆర్యన్ నిషాద్ ఒక వినూత్న పోర్టల్‌కు శ్రీకారం చుట్టాడు. bribes.fyi పేరిట ఈ వెబ్‌సైట్‌ను జులై 2న లాంచ్ చేశాడు.