సినిమా
చెన్నైలో ఏఆర్ రెహమాన్ కుమారుడికి ప్రమాదం.. తప్పిన ముప్పు!
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ కుమారుడు ఏఆర్ అమీన్ చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. చెన్నైలోని ఒలింపియా టెక్ పార్క్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఆయన ప్రయాణిస్తున్న లగ్జరీ కారు మరొక క్యాబ్‌ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
