ఏపీ
Aqwan Cyclone: ‘అర్నబ్’, ‘మొరుసు’ ముంచేశాయి.. ఇప్పుడు ఏపీని వణికించడానికి వస్తున్న మరో రక్కసి!
ఆంధ్రప్రదేశ్‌ను వరుస ప్రకృతి విపత్తులు వెంటాడుతున్నాయి. మొన్నటికి మొన్న తీరాన్ని వణికించిన అర్నబ్ తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోకముందే, ‘మొరుసు’ తుఫాన్ పంట పొలాలను ముంచెత్తి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కేవలం రెండు మూడు రోజుల వ్యవధిలోనే విరుచుకుపడిన ఈ జంట తుఫాన్ల దెబ్బతో కోలుకోలేక విలవిలలాడుతున్న అన్నదాతలకు, తీరప్రాంత ప్రజలకు వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. బంగాళాఖాతంలో మరో పెను తుఫాన్ పురుడుపోసుకుంటోంది.
