తెలంగాణ
Rains : ముంచుకొస్తున్న అక్వాన్.. తెలంగాణలో భారీ వర్షాలు!
మురసు తుఫాన్ విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌కు మరో గండం పొంచి ఉన్నది. బంగాళాఖాతంలో ‘అక్వాన్’ తుఫాన్ క్రమంగా బలపడుతున్నట్టు సమాచారం. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై బలంగా ఉంటుందని, ఏపీతో పాటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ కీలక సూచనలు చేశారు. ఈ నెల 20న అక్వాన్ తుఫాను ఉత్తర కోస్తాంధ్ర తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. ఫలితంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం పూర్తిగా మారిపోనుందని పేర్కొన్నారు.
