తెలంగాణ

వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు.. జయేశ్ రంజన్ సంచలన నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వంలో కీలక హోదాలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తదుపరి సీఎస్‌ బాధ్యతలు చేపట్టేందుకు అర్హుడిగా లైన్‌లో ఉన్న ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం దరఖాస్తు చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.కాగా, ఆయన వీఆర్ఎస్ అప్లికేషన్‌పై కేంద్ర సిబ్బంది శిక్షణా వ్యవహారాల శాఖ(డీవోపీటీ), తెలంగాణ ప్రభుత్వం నిబంధనలను అనుసరించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న జయేశ్ రంజన్.. సర్వీస్ కాలం ముగియడానికి ముందే వీఆర్ఎస్ తీసుకోవాలని నిర్ణయించుకోవడం బ్యూరోక్రసీ వర్గాల్లో హాట్ టాపిక్‌ అయ్యింది. ఇదిలాఉండగా, పాలనాపరమైన నిర్ణయాలు, ప్రాధాన్యత విషయంలో తన సీనియార్టీకి తగిన గుర్తింపు, గౌరవం దక్కలేదని ఆయన అసహనంతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.