తెలంగాణ

మద్యం సేవించి ‘నీట్’కు హాజరు.. అధికారులు ఏం చేశారంటే?

దేశవ్యాప్తంగా నీట్ పీజీ పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం అవ్వగా.. 8:30 గంటలకే పరీక్ష కేంద్రాల వద్ద ప్రధాన గేట్లు మూసివేసినట్టు తెలిసింది. పలుచోట్ల నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను లోనికి అనుమతించలేదని సమాచారం. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష కొనసాగనుంది. ఈ క్రమంలోనే పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇదిలాఉండగా, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడలో నీట్‌ పీజీ పరీక్షా కేంద్రానికి ఓ అభ్యర్థి మద్యం సేవించి హాజరైనట్టు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ రిజ్వాన్ అనే విద్యార్థి ఫుల్లుగా మద్యం సేవించి పరీక్షా కేంద్రానికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు.అతను పరీక్షా హాల్‌లోకి వెళ్లిన అనంతరం సిబ్బంది అతని తీరును గమనించారు. కాసేపటికే పరీక్ష రాయకుండా హాల్‌ నుంచి బయటకు పంపించి వేసినట్టు తెలిసింది.