తెలంగాణ

విచారణకు రండి.. వీసీ అల్డాస్ జానయ్యకు మహిళా కమిషన్ నోటీసులు

మహిళా ప్రొఫెసర్లను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఘటనలో రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌ అల్డాస్ జానయ్యకు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. విచారణకు రావాలని అందులో పేర్కొంది. అల్డాస్ జానయ్య లైంగికంగా వేధించాడని మహిళా ప్రొఫెసర్ చేసిన ఫిర్యాదు మేరకు తెలంగాణ స్టేట్ ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. కాగా, ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ అల్తాస్ జానయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడని అసిస్టెంట్ ప్రొఫెసర్ తేజశ్రీ ఆరోపించిన విషయం తెలిసిందే. పీహెచ్‌డీ డిప్యూటేషన్ పొడిగింపు అనుమతి కోసం వీసీ వద్దకు వెళ్తే అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా లైంగిక వేధింపులకు గురిచేశారని శనివారం ఆమె సొమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సంచలన ఆరోపణలు చేశారు. అర్ధరాత్రి ఫోన్ కాల్స్ చేసేవారని, వ్యక్తిగతంగా తనను కలవాలని, భర్తను వదిలి తనతో ఉండాలని ఒత్తిడి చేస్తున్నారని కంటతడి పెట్టారు.