చిత్రం లేదు
తెలంగాణమంత్రి ఇలాకాలో దారుణ దుస్థితి.. నీళ్లు లేవని అడిగినందుకు విద్యార్థినులను కొట్టిన ప్రిన్సిపాల్!
తెలంగాణ పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సొంత జిల్లాలో ప్రభుత్వ గిరిజన పాఠశాలల స్థితిగతులు అత్యంత అధ్వానంగా ఉన్నాయని నిరూపించే విచారకర ఘటన వెలుగుచూసింది. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ఐటీడీఏ కాలేజీ పక్కనే ఉన్న గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో కనీస వసతులు లేక విద్యార్థినులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తాగడానికి మంచినీళ్లు లేవని, దుస్తులు ఉతికే నీళ్లనే తాగాల్సి వస్తోందని విద్యార్థినులు కంటతడి పెడుతూ తమ ఆవేదనను మీడియా ముందు వెళ్లగక్కారు.
