National
AP: మరో వందే భారత్ రైలు రెడీ.. ఏపీలో ఆగే స్టేషన్లు ఇవే!
AP: రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. లగ్జరీ సదుపాయాలతో కూడిన సరికొత్త వందేభారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ను పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమైంది. బెంగళూరు - ముంబయి మధ్య నడవనున్న ఈ రైలుకు రైల్వే బోర్డు నుంచి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. దసరా పండుగ కానుకగా ఈ సూపర్ ఫాస్ట్ రైలు సేవలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ రూట్లో నడిచే వందేభారత్ స్లీపర్ ఏపీ ప్రయాణికులకు సైతం అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలోని అనంతపురం, గుంతకల్లు స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది. వీటితో పాటు మార్గమధ్యంలో రాయచూర్, కలబురగి, సోలాపూర్, పుణె, కల్యాణ్ జంక్షన్లలో హాల్ట్లు ఇచ్చారు. దీంతో అనంతపురం, గుంతకల్లు పరిసర ప్రాంతాల వారికి ముంబయి, పుణె, బెంగళూరు నగరాలకు నేరుగా కనెక్టివిటీ దొరకనుంది.
