సినిమా
ఇరుముడి మూవీ టీమ్ కు షాకిచ్చిన ఉపాధ్యాయ సంఘాలు!..
మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న వేళ.. కొత్త వివాదం తెరపైకి వచ్చింది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఉపాధ్యాయ వృత్తిని, ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను కించపరిచేలా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని ఏపీటీఎఫ్ ఆరోపించింది. ముఖ్యంగా ఓ మహిళా టీచర్ పాత్రను అనైతిక ప్రవర్తన కలిగిన వ్యక్తిగా చూపించడం అభ్యంతరకరమని పేర్కొంది.
