AP: ఏపీ టీచర్లకు గుడ్ న్యూస్.. స్థానికతపై కీలక ఉత్తర్వులు!
AP: ఆంధ్రప్రదేశ్‌లోని టీచర్లకు కూటమి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఉపాధ్యాయుల సర్వీసులు, పదోన్నతులు, ట్రాన్స్ఫర్ల విషయంలో ఎప్పటినుంచో నలుగుతున్న స్థానికత సమస్యను పరిష్కరిస్తూ ప్రభుత్వం తాజాగా అధికారిక ఆర్డర్స్ రిలీజ్ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులు-2025ను బేస్ చేసుకుని విద్యాశాఖలో వర్క్ చేస్తున్న దాదాపు 1.70 లక్షల మంది టీచర్ల కేడర్‌ను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.తాజా రూల్స్ ప్రకారం.. రాష్ట్రంలోని సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు ఇకపై పక్కాగా జిల్లా కేడర్ పరిధిలోనే కొనసాగుతారు. ప్రభుత్వ తాజా స్టెప్‌తో సుమారు లక్ష మంది ఎస్జీటీలకు, 70 వేల మంది వరకు ఉన్న స్కూల్ అసిస్టెంట్లకు తమ సొంత జిల్లాల పరిధిలోనే పోస్టింగులు, ప్రమోషన్లు దక్కే రూట్ క్లియర్ అయింది. రాబోయే రోజుల్లో చేపట్టే సాధారణ బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియలో ఈ ఉత్తర్వులే ప్రామాణికంగా మారనున్నాయి.
