ఏపీలో కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్.. షెడ్యూల్ ప్రకటించిన ప్రభుత్వం!
ఏపీలో సంక్షేమ పథకాల అమలులో మరో కీలక అడుగు పడింది. కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ మేరకు అర్హులైన పేదలు, వృద్ధులు, వితంతువులు తదితర అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా అధికారులు తెలిపారు. తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. కొత్ పింఛన్లకు రేపటి నుంచి ఈ నెల16 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు కార్యాలయాల్లో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా వచ్చిన అప్లికేషన్లను ఈ నెల 17 నుంచి 21 వరకు క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ ప్రక్రియను చేపడుతారు. ఇక సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్ అలాగే జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. చివరగా సెప్టెంబర్ 25, 26 తేదీల్లో పింఛన్‌కు అర్హులైన వారి దరఖాస్తులను ఆమోదించనున్నారు.
