ఏపీ

AP Municipal Elections: విటమిన్ 'ఎం' దెబ్బకు ఫ్యాన్ గిలగిలా!

మున్సిపల్ ఎన్నికల నగారా మోగినప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక్కటే హుకుం జారీ అయింది. "కూటమికి ఒక్క సీటు కూడా ఏకగ్రీవం కావడానికి వీల్లేదు.. ఎవడైనా ఏకగ్రీవం చేస్తే వచ్చే అసెంబ్లీలో టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదు" అని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నియోజకవర్గ ఇంచార్జీలకు తేల్చి చెప్పారు. కానీ రిజల్ట్స్ వచ్చాక చూస్తే.. ఏకంగా 25 మున్సిపాలిటీలు కూటమి ఖాతాలోకి వెళ్లిపోయాయి. జగన్ అంత సీరియస్ వార్నింగ్ ఇచ్చినా క్షేత్రస్థాయిలో లీడర్లు ఎందుకు సైలెంట్ అయిపోయారు? కార్యకర్తలు కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నా, సేనాపతులే ఎందుకు కాడి పారేశారు? దీని వెనుక ఉన్న అసలు మతలబు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన ‘విటమిన్ ఎం’ (డబ్బు) పంచాయితీనే కారణం అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.