ఏపీ

డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పోస్టులు సరైనవే : శాప్‌ ఎండీ

AP: ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన మెగా డీఎస్సీపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని శాప్‌ ఎండీ భరణి అన్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్‌ కోటా పోస్టుల భర్తీలో ఎలాంటి తప్పులకు తావులేకుండా నిబంధనల ప్రకారమే ఎంపిక చేపట్టినట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో పాఠశాల విద్య కమిషనర్‌ తమీమ్‌ అన్సారియాతో కలిసి ఆమె ఈ రోజు మీడి.జూడో కోటాలో ఎంపికైన అభ్యర్థులపై దాఖలైన పిటిషన్‌ నేపథ్యంలో అన్ని ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిపారు. డీవోపీటీ సూచనలు, హైకోర్టు ఆదేశాల మేరకే ప్రక్రియను పూర్తి చేశామని, ఎలాంటి నిబంధనలను మార్చలేదని వెల్లడించారు. ఒకే టోర్నీలో పాల్గొన్న భార్యాభర్తలను కూడా నిబంధనల ప్రకారం పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. పోటీల్లో పాల్గొనాలంటే తప్పనిసరిగా అదే ప్రాంతంలో చదువుకోవాలనే నిబంధన లేదని వివరించారు.